Recents in Beach

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.Where we have no value there is no value in how hard we have worked.

రచయిత ముందు మాట

నా మొదటి మోటివేషన్ బ్లాగ్ కాబటి ముందు మాట అని నేను చెపుతున్నాను.ఎవరైనా కష్టాన్ని నమ్ముకొని పని చేయండి.అదే మీ ప్రెసెంట్ మరియు ఫ్యూచర్ లో మీకు ఆనందాన్ని ఇస్తుంది.మీరు 80% కష్టాన్ని నమ్ముకొని 20% మీ దేవుణ్ణి ప్రార్దించండి అంతే కాని మనం కష్టపడకుండ దేవుణ్ణి అడిగితే అయన ఏమి చేస్తాడు చెప్పండి.

ఒకటి మాత్రం తెసుకోండి " మనం కష్టపడింది సంపాదించింది మనతో జీవిత కాలం ఉంటుంది,మోసం చేసి సంపాదించింది మనతో జీవిత కాలం మనతో ఉండదు " ఇది వాస్తవం.ముందు మీ నిజాయితీ గల కష్టాన్ని మీరు నమ్ముకోండి.

Read more : వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబిత ఎల తెలుసుకోవాలి.

ఇప్పుడు అసలైన విషయంలోకి వెళ్ళిపోదాం..
ఒక యజమానికి ఒక పెంపుడు కుక్క ఉండేది.ఆ కుక్క చాల కష్టపడి పని చేస్తుంది కాని ఆ యజానికి కుక్క అంటే ఇష్టం వుడేది కాదు.

ఒకరోజు కుక్క కిరాణా షాప్ కి సరుకులు కొనడానికి వేలింది ఎలవేల్లింది అనుకొంటున్నారా సరుకుల చీటీ మేడలో తగిలించుకుని నోటితో డబ్బులు కరచుకొని వెళ్ళింది.
చీకటి పడుతుంది కిరాణా షాప్ యజమాని షాప్ క్లోజ్ చేస్తున్నాడు అప్పుడే కుక్క షాప్ దగ్గరికి వచ్చింది.ఆ కుక్కని చుసిన షాప్ యజమాని షాక్ అవుతాడు అలాగే ఆశ్చర్యానికి గురి అవుతాడు.ఎందుకంటె కుక్క సరుకుల కోసం కిరణా షాప్ కి రావటం ఏమిటి అని అంటే కాకుండా మేడలో సరుకుల చీటీ నోట్లో డబ్బులు చూసి.సరే అని చీటిలో చూపిన సరుకులు తీసి ఒక సంచిలో వేసి ఆ సరుకుల సంచిని కుక్క మేడలో వేసి కుక్క నోట్లో ఉన్న డబ్బులను తెసుకుని సరుకులకు అయినా డబ్బులు తెసుకుని మిగిలిన చిల్లర సరుకులతో పాటు సంచిలో వేస్తాడు.


తరువాత ఈ కుక్క ఏం చేస్తుందో చూద్దాం అని కుక్కని వెంబడిస్తూ దాని వెనుక వెళతాడు.ఆ కుక్క తన యజమాని ఇంటికి వెళుతుంది కిరణా షాప్ యజమాని కుడా దాని వెంట వెళతాడు.అది తన యజమాని ఇంటికి వెళ్లి మెయిన్ డోర్ తాళం వేసి ఉంటుంది.అప్పుడు కుక్క తన కాళ్ళతో మెయిన్ డోర్ కొడుతుంది.కాని డోర్ ఎవరు తీయరు క్రొద్ది సమయం అయిన తరువాత కుక్క ఇంటి వెనుకకు వెళ్లి కిటికీ తలుపులను తన రెండు కాళ్ళతో తన్నుతుంది కాని ఎవరురారు.ఇది అంత కిరాణా షాప్ యజమాని గమనిస్తూ ఉంటాడు.

అలా క్రొద్ది సమయం అయిన తరువాత కుక్క యజమాని కోపంతో కుక్కని ఎన్ని సార్లు నీకు చెప్పాలి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తెసుకొని వెళ్ళమని చేపాను అని కోపాడతాడు.

గమనించార కుక్క అయివుండి కుడా అంత పని చేస్తే చేస్తే కానిసం విశ్వాసం కుడా లేకుండా కుక్కని తెడుతునాడు.

నీతి : మన జీవితంలో, మనం పనిచేసే చోట ఇటువంటి యజమానులు కుడా ఉంటారు.అందువల్ల మీ కష్టాని నమ్ముకోండి అంతే.